లాక్‌డౌన్ సందర్భంగా పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. పరిశ్రమలు మూసివేయాలని తామెవ్వరినీ ఆదేశించలేదన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే సిబ్బంది తమ పనులు చేసుకోవచ్చని తెలిపినా...కరోనా భయంతో చాలా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: 5వేల బోగీల్లో ఐసోలేషన్ వార్డులు: భారతీయ రైల్వే