నెల్లూరు జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల వద్ద అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పరిషత్ ఎన్నికలు యధాతథంగా నిర్వహిస్తున్నందున.. పోలింగ్ సజావుగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
గుడూరులో...
గుడూరు మండల కార్యాలయం వద్ద అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియను సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ కృషిచేయాలని సిబ్బందికి సూచించారు.