ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి సమీపంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై జరిగింది. వాహనం రోడ్డు పక్కనే ఉన్న జామాయిల్ తోటలోకి దూసుకెళ్లటంతో.. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డవారంతా మర్రిపాడు మండలం కేతిగుంట గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మర్రిపాడు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి...