ETV Bharat / state

మద్యం లేక తల నరుకున్న వ్యక్తి - నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య తాజా వార్తలు

మద్యానికి బానిసైన వ్యక్తి మానసిక స్థితి తప్పి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్​పేట మండలం దూబగుంట గ్రామంలో చోటుచేసుకుంది. లాక్​డౌన్​ సందర్భంగా మద్యం దొరక్కా పురుగులు మందు తాగి, అనంతరం కత్తితో తలపై నరుకున్న వైనం స్థానికంగా కలకలం రేపింది.

man sucide in nellore dist
మద్యం దొరకలేదని వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Apr 26, 2020, 10:26 AM IST

నెల్లూరు జిల్లా ఏఎస్​పేట మండలం దూబగుంట గ్రామానికి చెందిన వేము రమణయ్య అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించాయి. ఈ నిబంధనలతో రమణయ్యకు తాగడానికి మద్యం దొరకలేదు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటిలో ఉన్న పురుగులు మందు సేవించి, అనంతరం కత్తితో తలపై నరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రమణయ్యను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడటం ఆత్మకూరు డివిజన్​లో ఇది రెండో సంఘటన కావడం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

తెదేపా నేతలవి డూప్ రాజకీయాలు: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.