ETV Bharat / state

ఖనిజ ఆదాయానికి 'టెండర్'.. ఏపీఎండీసీకి తగ్గిన రాబడి - ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏటేటా పెరగాల్సిన ఖనిజం ధర అనూహ్యంగా పడిపోయింది. పోటీ పడతారనుకున్న టెండర్‌కు రెండే రెండు బిడ్లు దాఖలయ్యాయి. చిన్న చిన్న లీజులుగా విడగొట్టిన క్వారీలు కూడా ఏకపక్షంగా ఒకే గుత్తేదారు వశమయ్యాయి. వెరసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. నెల్లూరు జిల్లాలో ఇటీవల నిర్వహించిన సిలికా శాండ్‌ టెండర్ల వ్యవహారంలో అన్ని దశల్లోనూ అనుమానాలు మిగిలిపోయాయి. గతేడాది ధరల ప్రకారం చూసినా ఈ ఏడాది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హీనపక్షం రూ.67.15 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. దీని వెనుక జరిగిన తతంగమిది!

drastic fallen in silica sand rate
drastic fallen in silica sand rate
author img

By

Published : Aug 29, 2020, 7:45 AM IST

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినిపట్నం గ్రామ పరిధిలోని 211 హెక్టార్లలో సిలికా శాండ్‌ తవ్వి, అమ్ముకునేందుకు ఈ ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచారు. ఇసుక మేటలు ఉన్న ప్రాంతాన్ని 47 క్వారీలుగా విభజించినప్పటికీ, అన్నింటికి కలిపి ఒకే టెండరు పిలిచారు. ఇందులో పాల్గొనే సంస్థల వార్షిక టర్నోవర్‌ రూ.400 కోట్లు ఉండాలనే నిబంధన విధించారు. ఎప్పటి నుంచో సిలికా శాండ్‌ తవ్వకాల్లో ఉన్న ఇతర సంస్థలు, లీజుదారులు ఈ నిబంధనతో టెండరు వేయలేకపోయారు. ఏపీఎండీసీ బేసిక్‌ ధర టన్నుకు రూ.200గా నిర్ణయించగా.. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌) రూ.202, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హైదరాబాద్‌) రూ.212 చొప్పున కోట్‌ చేశాయి.

బేసిక్‌ ధర కంటే టన్నుకు రూ.12 అదనంగా వేసిన శ్రీ అవంతికకు ఇటీవలే టెండరు ఖరారు చేశారు. గతేడాది ఇదే జిల్లా కోట మండలం కొత్తపట్నం ప్రాంతంలో 12 హెక్టార్లలో సిలికా శాండ్‌కు ఏపీఎండీసీ టెండర్లు పిలిచింది. బేసిక్‌ ధర రూ.150గా పేర్కొంది. నెల్లూరు జిల్లాకే చెందిన ఓ సంస్థ రూ.291 కోట్‌ చేసి టెండర్‌ దక్కించుకుంది. ఏడాది తర్వాత ధర పెరగకపోగా, గతం కంటే రూ.79 తక్కువకు పాడుకోవడం గమనార్హం. తుమ్మినిపట్నం ప్రాంతంలో 85 లక్షల టన్నుల ఖనిజ నిల్వలున్నట్లు అంచనా. ఖరారైన టెండర్‌ ప్రకారం ఏపీఎండీసీకి టన్నుకు రూ.212 చొప్పున రూ.180 కోట్ల ఆదాయం వస్తుంది. అదే రూ.291 చొప్పున ధర ఉంటే మరో రూ.67 కోట్లు అదనంగా వచ్చేది.

ఏపీఎండీసీ వాదన ఇది

దీనిపై ఏపీఎండీసీ వాదన భిన్నంగా ఉంది. ‘గతేడాది 12 హెక్టార్లలో టెండర్లు పిలిచినపుడు సిలికా శాండ్‌కు గనుల శాఖ సీనరేజ్‌ ఫీజు టన్నుకు రూ.75 ఉండేది. దానికి రెట్టింపుగా రూ.150 బేసిక్‌ ధర నిర్ణయించాం. ప్రస్తుతం సీనరేజ్‌ ఫీజు రూ.100 కాగా, దానికి రెట్టింపుగా రూ.200గా నిర్ణయించాం. కొత్తపట్నం లీజు ప్రాంతం కంటే, తుమ్మినిపట్నం వద్ద ఖనిజం నాణ్యత కొంత తక్కువ. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ విలువ రూ.506 కోట్లు కావడంతో టెండర్లలో పాల్గొనే గుత్తేదారు సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.400 కోట్లు ఉండాలనే నిబంధన విధించాం’ అని అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్ట్‌ రూపకల్పన, టెండరు, నిబంధనలు తదితరాలన్నీ కేపీఎంజీ అనే అంతర్జాతీయస్థాయి సలహా సంస్థ ద్వారా చేపట్టినట్లు వివరించారు. చిన్నచిన్న లీజులుగా విభజించి కూడా ఉమ్మడిగా టెండర్‌ పిలవడంపై ప్రశ్నించగా.. ఒకే ప్రాంతంలో ఉన్నందున ఒకే టెండర్‌గా నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తంగా 47 లీజులుగా విభజించిన ఇందులో 11 లీజులకు మాత్రమే పర్యావరణ అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలికి ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. వీటిలో రెండింటికే అనుమతులు వచ్చాయి. మిగతా 9 లీజులు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నందున అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని పీసీబీ సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.