డెంగీ జ్వరంతో మృతిచెందుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పారిశుధ్ధ్య నిర్వహణ లోపించి... విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉమ్మాయపల్లి గ్రామంలో పుచ్చకట్ల రవి (26) అనే యువకుడు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. ఈ ఘటన మరువకముందే మర్రిపాడు మండల కేంద్రంలోని బాలుపల్లిలో ఆఫియా(6) అనే చిన్నారి డెంగీతో మృతిచెందింది. సంగం మండలం మర్రిపాడు గ్రామంలో 2రోజుల క్రితం దుగ్గి విజయభాస్కర్ (26) జ్వరంతో మృతిచెందాడు. ఆత్మకూరు నియోజకవర్గంలోనూ డెంగీ జ్వరంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించండి