ETV Bharat / state

శ్మశానంపై పెద్దల కన్ను.. కాపాడుకునేందుకు గ్రామస్థుల పోరాటం - డీసీ పల్లి శ్మశానంపై కబ్జాదారుల కన్ను

An attempt to encroach on the crematorium: శ్మశానవాటికను కాపాడుకునేందుకు ఆ గ్రామస్థులు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్న శ్మశానంపై.. అధికార పార్టీ నేతల కన్నుపడిందని.. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని గ్రామస్థులు అరోపించారు.

వినతి పత్రంతో గ్రామస్తలు
వినతి పత్రంతో గ్రామస్తలు
author img

By

Published : Nov 15, 2022, 4:13 PM IST

శ్మశానంపై పెద్దల కన్ను.. కాపాడుకునేందుకు గ్రామస్థుల పోరాటం

An attempt to encroach on the crematorium: రెండు శతాబ్దాలుగా శ్మశానవాటికగా ఉన్న స్థలాన్ని కాపాడుకునేందుకు గ్రామస్థులు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. అధికారులు మారినా.. అర్జీలు ఇవ్వడం మానలేదు. కోట్ల విలువైన స్థలంపై కబ్జాదారులు కన్నేశారని.. రికార్డులు తారుమారు చేసి కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీ.సీ.పల్లిలో శ్మశానవాటికను కాపాడుకోవడం కోసం స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్న శ్మశానంపై అధికార పార్టీ నేతల కన్నుపడిందని.. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని గ్రామస్థులు అరోపించారు. శ్మశానానికి ఆనుకుని జాతీయ రహదారి వెళ్తుండటంతో.. ఇక్కడ భూములు ధరలు భారీగా పెరిగాయి. దీంతో శ్మశాన వాటిక ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా ఈ స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. విలువైన స్థలం చుట్టూ కంచె వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

డీ.సీ.పల్లిలో స్థలం తమదంటే తమదని ఇరువర్గాలు వినతిపత్రాలు అందజేశారని అధికారులు తెలిపారు. రికార్డులన్నీ పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వివరించారు. నెల్లూరు జిల్లాలో 60 శాతం శ్మశాన వాటికల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇప్పటికే అనేక చోట్ల నాయకులు కబ్జా చేశారు. ఆక్రమణలు తొలగించాలని ప్రజలు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.