పచ్చని పంటలు పండే భూములను రెవెన్యూ శాఖ అధికారులు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచవాడపాలెంలో 2.45ఎకరాలు, అన్నమేడులో 53 సెంట్ల భూములను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాల్లో పలువురు నిరుపేద రైతులు 20 సెంట్ల చొప్పున ఈ భూమిని సాగు చేస్తున్నారు. ఈ భూమే వారికి జీవనాధారం. వరి సాగు చేస్తున్న భూముల్లో అధికారులు రాళ్లు నాటి పంట ధ్వంసం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలు ఉన్నా వాటికి ఏవో సాకులు చూపుతున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు మాత్రం..... తాము ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నామని అంటున్నారు.
ఇదీ చదవండి: అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 'నాడు-నేడు'