రాష్ట్రానికి ద్రోహం చేసిన భాజపాతో కలిసి వైకాపా, తెదేపా, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీలన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలని మధు నిలదీశారు. పార్టీల పరిస్థితులపై 15 వ తేది వరకు దేశ వ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు