జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ.. నెల్లూరులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. కొవిడ్ రోగులకు ఆక్సిజన్, వెంటిలేటర్లు, పడకల సంఖ్య పెంచాలని.. సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకుడు మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ- 22 మంది మృతి
తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియామించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం నేతలు కోరారు. కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు సకాలంలో నాణ్యమైన పౌష్ఠిక ఆహారం అందించాలని.. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను నిరంతరం శానిటేషన్ చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
అక్రమంగా తరలిస్తున్న మద్యం ప్యాకెట్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్