పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పన్నులు పెంచేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాగితాలను దహనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, పన్ను భారం మోపే నిర్ణయాలు తీసుకోవడం దారుణమని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.
ఆరు మున్సిపల్ చట్టాలకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, దాన్ని చట్టంగా మార్చేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధిస్తే, ప్రజలపై అధిక భారం పడుతుందని వివరించారు. వెంటనే పన్ను పెంపు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: