నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో ఆరోగ్య మిత్రగా పనిచేస్తున్న యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అతడిని నెల్లూరు ఐసోలేషన్‌కు తరలించారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. ఇటీవల ఈ యువకుడు సచివాలయాలలో ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశాడు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ బ్యాంకు కేంద్రం ప్రారంభ ఏర్పాట్లు చేశాడు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అతని ప్రాథమిక కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
ఇవీ చదవండి...