ETV Bharat / state

నాలుగు గంటలు అంబులెన్సులోనే మహిళ.. శ్వాస ఆడక మృతి

author img

By

Published : Apr 24, 2021, 12:01 PM IST

కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి ఏర్పాట్లు కనిపించటం లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కరోనా బాధితురాలు.. సుమారు నాలుగు గంటల పాటు అంబులెన్సులోనే మృత్యువుతో పోరాడింది. ఎక్కడా ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేకపోవటంతో.. ఆ ఆసుపత్రి.. ఈ ఆసుపత్రి అంటూ ఆశగా పరుగులు పెట్టినా.. ప్రాణం పోయింది.

corona patient died due to lack of oxygen
కరోనా బాధితురాలు మృతి

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కరోనా బాధితురాలికి.. ఆక్సిజన్ పడక దొరక్క ప్రాణాలు విడిచింది. పట్టణంలోని జేఆర్​ పేటకు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటంతో.. 108 వాహనంలో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆక్సిజన్ బెడ్లు లేవనీ.. నెల్లూరు తీసుకువెళ్లాలని ఆసుపత్రి అధికారులు సూచించారు. దీంతో ఆత్మకూరులో ఉన్న రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లినా.. వారు కూడా చేర్చుకోలేదు. ఆత్మకూరులోనే సుమారు రెండు గంటలకు పైగా నిరీక్షించి.. చివరకు నెల్లూరుకు ప్రయాణమయ్యారు.

నెల్లూరు ఆసుపత్రిలో సైతం ఆక్సిజన్ బెడ్లు లేకపోవటంతో.. ఆక్సిజన్ అందక 108లోనే బాధితురాలు ప్రాణాలు వదిలింది. సుమారు నాలుగు గంటల పాటు బాధితురాలు.. ఊపిరాడక నరకయాతన అనుభవించిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ విషయం తెలిసిన ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షిణి హుటాహుటిన.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను పరిశీలించారు. మరికొన్ని అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు.

స్వయాన మంత్రి నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగటంతో.. ఆత్మకూరు పట్టణంలో సరైన వైద్యం అందించటం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్​లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.