ETV Bharat / state

పెరిగిన ‘కోయంబేడు’ లింకులు.. జల్లెడ పడుతున్న యంత్రాంగం

కరోనా కట్టడిపై నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. లాక్​డౌన్​ సడలింపులతో చెన్నై నుంచీ రాకపోకలకు సాగడం వల్ల ‘కోయంబేడు’ కారణంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వైరస్​ బారిన పడినవారిని గుర్తించడంలో అధికారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

corona cases increased
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jun 14, 2020, 6:16 PM IST

కరోనా కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించి పనిచేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ‘కోయంబేడు’ లింకు కేసులతో పాటు.. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో చెన్నై నుంచీ రాకపోకలు ఎక్కువైన నేపథ్యంలో సునిశితంగా అధ్యయనం చేస్తున్నారు. జిల్లాలో కరోనా విజృంభణ ప్రస్తుతం ఎక్కువైంది.

మార్చి 9న రాష్ట్రంలోనే తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన జిల్లాలో అధికారుల ముందస్తు జాగ్రత్తలతో తొలుత కొంతమేర కట్టడి అవుతున్నట్లు కనిపించింది. దిల్లీ కాంటాక్టులతో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగ్గా.. మళ్లీ కోయంబేడు కలకలంతో అనూహ్యంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరనా బాధితుల సంఖ్య 400 దాటగా.. 257 మంది డిశ్ఛార్జి అయ్యారు. అయిదుగురు చనిపోగా, 145 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ కోయంబేడు కాంటాక్టులు ప్రస్తుతం కీలకంగా మారాయి.

జల్లెడ పడుతున్న అధికారులు..
బహిరంగంగా అభ్యర్థిస్తున్నా కొందరు తమ వివరాలు వెల్లడించడం లేదు. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారులపై ప్రయాణించిన వారి వాహనాల నంబర్లను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు టోల్‌ప్లాజాల వద్ద సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారిపై కాకుండా పల్లెదారుల్లో వచ్చిన వారి వివరాలను తెలుసుకునేందుకు సెల్‌ టవర్ల లొకేషన్లపై దృష్టి పెట్టారు.

తడ నుంచి కావలి వరకు పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఎంత మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు? వేరే ప్రాంతాలకు చెందిన వారు ఎంత మంది జిల్లాకు వచ్చారు? అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఇక్కడ ఆ తరహా వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అధికారులకు సమాచారం అందిస్తే వారిని పరీక్షించి అవసరమైతే చికిత్స అందించడానికి అనువుగా ఉంటుంది. ఇప్పటికైనా ఆ ప్రయాణికులు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ పరిస్థితి...

కోయంబేడు మార్కెట్లో భారీ ఎత్తున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తెలిసిందే. అక్కడి వ్యాపారులు జిల్లాకు రావడం, జిల్లాకు చెందిన వ్యక్తులు కోయంబేడు వెళ్లడం కేసులు అమాంతం పెరిగాయి. ప్రధానంగా సూళ్లూరుపేటపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో 80 కేసులు నమోదు కాగా.. సూళ్లూరుపేటలో 113 కేసుల పైబడి నమోదు కావడం చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం రోజూ అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో అధికారులు దృష్టి పెట్టారు. కేసుల సంఖ్యను తగ్గించుకునేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఆ క్రమంలోనే చెన్నై, కోయంబేడు ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తుండగా.. సరైన సమాచారం లభించడం లేదు. ఓ దశలో క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని భావించి అలా వచ్చిన వారూ సమాచారమివ్వని దుస్థితి. దీంతో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, వాలంటీర్ల వ్యథ అంతా ఇంతా కాదు.

ఇవీ చూడండి...

ఆసుపత్రి నిధులు స్వాహా చేసిన మహిళా ఉద్యోగి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.