నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో ఇప్పటివరకు కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు కలిగిన 54 మందిని అధికారులు గుర్తించారు .ఇప్పటికే గూడూరు డివిజన్ లో 14 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో కరోనా కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నిత్యం కోయంబేడు మార్కెట్ నుంచి గూడూరుకు కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో అధికారులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు ఉన్న వారిని గుర్తించారు. వారిలో సుమారు 32 మందిని క్వారంటైన్‌కు తరలించి వారి శాంపిల్స్ సేకరించారు.