ఎస్ఈబీ అధికారులు.. నెల్లూరు జిల్లా దేపూరు వద్ద పేకాట స్థావరాలపై దాడి చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురి వద్ద డబ్బు తీసుకొని వదిలేశారని, మిగిలిన వారితోనూ మంతనాలు చేస్తున్నారని దేపూరు గ్రామస్థులు ఆరోపించారు. సెబ్ అధికారులను అడ్డుకుని నిర్బంధించారు.
ఈ వ్యవహరంపై ఆత్మకూరు పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. ఎస్సై రవినాయక్‌కు ఫిర్యాదు చేశారు. చివరికి.. పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి సెబ్ సిబ్బందిని విడిపించారు. జూద ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లనుంచి రూ. 20 వేల నగదు, ఐదు వాహనాలను సీజ్ చేశారు.
ఇదీ చూడండి: