పెండింగ్లో ఉన్న తమ వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. స్థానిక తహసీల్దార్ హరనాథ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. కరోనా ఆపత్కాలంలోనూ బాధ్యతగా విధులు నిర్వహించామని గుర్తుచేశారు.
అధికారులు మాత్రం తమ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా వేతనాలు అందకపోవటం వల్ల కుటుంబ పోషణ భారంగా మారి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అధికారులు చొరవచూపి వెంటనే వేతనాలు మంజూరు చేయాలని కోరారు. లేదంటే ఈనెల 20 తర్వాత సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: