Chandrayaan: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్కు శుక్రవారం చంద్రయాన్-3కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హోట్ టెస్ట్ మోడల్ (ఐహెచ్టీ) చేరింది. దీన్ని బెంగళూరులోని యూఆర్రావు శాటిలైట్ సెంటర్ నుంచి ప్రత్యేక వాహనంలో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల బందోబస్తు మధ్య షార్కు తీసుకొచ్చారు. ఈ ఏడాది చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నారు.
అసోంలో ఎన్‌ఈటీఆర్‌ఏ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అసోంలో ప్రాజెక్టు నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (ఎన్‌ఈటీఆర్‌ఏ)ను ఏర్పాటు చేయనుంది. దీనికి కోసం ఇస్రో వంద ఎకరాల భూమిని ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కమ్రూప్ (మెట్రో) జిల్లాలోని చంద్రపుర్ వద్ద స్థలాన్ని గుర్తించింది. ప్రతిపాదిత స్థలాన్ని ఆ రాష్ట్ర మంత్రి కేశబ్ మహంత పరిశీలించారు.
ఇదీ చదవండి: