తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి నెల్లూరు వచ్చిన చంద్రబాబు.. స్థానిక తెదేపా నేతలను ఇళ్లకు వెళ్లి పలకరించారు. సర్వేపల్లి నియోజకవర్గ ముఖ్యనేతలతో నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో సమావేశమైన అనంతరం.. పలువురు పార్టీ నేతల కుటుంబాలను కలిశారు.
ఇదీ చదవండి: మహిళపై పెట్రోల్ పోసి సజీవదహనం.. ఆపై తానూ..
తెదేపా సీనియర్ నేతలు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, సుబ్బానాయుడుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు.. కాసేపు వారితో ముచ్చటించారు. కుటుంబ సభ్యులు, ఇతర కార్యకర్తలతో ఫోటోలు దిగి వారిలో ఆనందాన్ని నింపారు. ఆపత్కాలంలో పార్టీ కోసం కష్టపడే వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: