ETV Bharat / state

రాజకీయాలను వ్యాపారమయం చేస్తున్నారు.. - సీఎం జగన్​పై సోమువీర్రాజు వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరితో రాజకీయాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొన్నారు.

bjp leader somu veerraju tour at buchireddy palem

author img

By

Published : Mar 17, 2021, 5:42 PM IST

ప్రజా ప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరితో రాజకీయాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో సోము వీర్రాజు పర్యటించారు. ప్రస్తుతం రాజకీయాలను వ్యాపారమయం చేస్తున్నారని విమర్శించారు. అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాలు చేయడం దారుణమన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి తప్ప.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని సోము వీర్రాజు అన్నారు. భాజపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. పలువురు వైకాపా నేతలు భాజపాలో చేరగా... కండువాలు కప్పి సోము వీర్రాజు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.