హాస్టల్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ప్రవల్లిక నగరంలోని హరనాథపురంలో ఓ హాస్టల్లో పేయింగ్ గెస్ట్‌గా చేరింది. అదే హాస్టల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి అయిన సాయి కీర్తి కూడా ఉంటున్నారు. సాయి కీర్తి ఆదమరిచిన సమయంలో ప్రవల్లిక బ్యాగులోని రూ.4 వేల నగదు, ఏటీఎం కార్డు, చరవాణి తీసుకుని పరారైంది. ఏటీఎం నుంచి రూ.25 వేల నగదు సైతం డ్రా చేసింది. సాయికీర్తి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.33 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవల్లిక గతంలోనూ పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు బాలాజీ నగర్ సీఐ సోమయ్య తెలిపారు.
ఇదీ చూడండి : గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి