నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పెద్ద అబ్బీపురం గ్రామంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే సర్పంచ్ మాధవరెడ్డిపై ప్రత్యర్దులు మారణాయుధాలతో దాడి చేశారు. తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసం అయ్యింది.
అసలేం జరిగిందంటే...
గ్రామంలోని ఓ పొలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఇరువురు గొడవపడ్డారు. ఒక వర్గం వారు సర్పంచ్‌ని ఆశ్రయించగా ఆయన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వస్తుండగా స్టేషన్ సమీపంలోనే సర్పంచ్ మాధవరెడ్డి పై ప్రత్యర్థి సీతారామరెడ్డి వర్గీయులు కర్రలు, రాడ్లు, రాళ్ళతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసం కాగా.. తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వైకాపా పార్టీ నుంచి మాధవరెడ్డి, సీతారామరెడ్డి పోటీ చేశారు. వారిలో మాధవరెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కాగా.. ఇద్దరి మధ్య వివాదాలు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నియోజకవర్గంలో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి:
Kadapa Suicide's Mystery: ఇద్దరు విద్యార్థినుల బలవన్మరణం..కారణమేంటి..?