ETV Bharat / state

కలసికట్టుగా కరోనాపై పోరు - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు

నెల్లూరు జిల్లాలో కరోనా పరిస్థితులపై ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, సిబ్బంది కొరత పై చర్చించారు. కరోనా బాధితులకు వైద్యం అన్నిరకాలుగా అందించేలా చూస్తున్నామని మంత్రులు తెలిపారు.

ministers
ministers
author img

By

Published : May 19, 2021, 3:09 PM IST

కొవిడ్‌ నివారణకు అందరూ కలిసికట్టుగా తమ వంతు విధులు నిర్వర్తించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన కొవిడ్‌ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. గుర్తించిన కొవిడ్‌ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ వారికి కేటాయించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలనూ వివరించారు. పడకల ఖాళీలు, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందిస్తున్న మందులు, ఆక్సిజన్‌ పడకల వివరాలు, 104 ద్వారా అందుతున్న సేవలపై నిత్యం సమీక్షిస్తూ ఆ వివరాలు తెలియజేయాలని కలెక్టర్‌కు సూచించారు. నెల్లూరు ఆసుపత్రిలో జర్మన్‌ సాంకేతికతతో ఒక షెడ్‌ ఏర్పాటు చేశారని, మరో మూడు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు.

జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ఐసీయూ, వెంటిలేటర్, ఆక్సిజన్‌ పడకల కేటాయింపునకు ఇబ్బంది ఏర్పడుతోందన్నారని కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. ప్రస్తుతం రోజూ 200 ఆక్సిజన్‌ సిలిండర్లు ఉత్పత్తి అవుతున్నాయని, త్వరలో 400 ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడుతామన్నారు. రెమ్‌డెసివిర్, స్టెరాయిడ్స్‌ ఇచ్చినా కోలుకోని 31 క్రిటికల్‌ కేసులకు కమిటీ సిఫార్సు మేరకు టోసిలిజుమాజ్‌ ఇంజక్షన్లు ఇవ్వగా.. వారు కోలుకున్నారని చెప్పారు.

కావలి, సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు పలు సమస్యలను జిల్లా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్సిజన్‌ పడకల కొరత.. బాధితులు ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నతీరు, వైద్యుల కొరత, తమ ఫోన్లకూ స్పందించని వైనం తదితరాలను వివరించారు. దానికి మంత్రి బాలినేని.. వాటిని పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు గ్రామీణం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎస్పీ భాస్కర్‌ భూషణ్, జేసీలు హరేంధిరప్రసాద్, గణేష్‌కుమార్, నోడల్, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పాల్గొన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లను సంబంధిత అధికారులకు అందించారు.

ఇదీ చదవండి: ఈ యాప్​లతో మీరే ఐప్యాడ్‌ ఆర్టిస్టులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.