ETV Bharat / state

AP JAC : ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరుబాట: ఏపీ జేఏసీ అమరావతి నాయకులు - బొప్పరాజు వెంకటేశ్వర్లు

AP JAC Amaravati movement : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చి పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఏపీజేఏసీ అమరావతి నాయకులు స్పష్టం చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ నెల 18, 25, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో నిరసనలు ఉంటాయని వెల్లడించారు. ట్రేడ్ యూనియన్ల మద్దతుతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

ఏపీ జేఏసీ అమరావతి నాయకులు
ఏపీ జేఏసీ అమరావతి నాయకులు
author img

By

Published : Apr 17, 2023, 7:41 PM IST

AP JAC Amaravati movement : ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు స్పష్టం చేశారు. మలి దశ ఉద్యమంలో భాగంగా సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నెల 18, 25, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో నిరసనలు ఉంటాయని వెల్లడించారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే వేధిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సమైక్యంగా పోరాటానికి పిలుపునిచ్చారు.

ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరు.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసనలు కొనసాగుతాయని, రాష్ట్రంలో రెండో దశ పోరాటం మొదలైందని సభ్యులు తెలిపారు. రెండో దశ పోరాటంలో భాగంగా 18, 25, 29 తేదీల్లో తమ డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

సన్నాహక సమావేశం... నెల్లూరులో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పోరాటానికి సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. చిత్తశుద్ధితో పోరాటాన్ని నడిపిస్తూ, ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. తిరుపతి, చిత్తూరు కార్యక్రమాలను తాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై పోరాట కార్యాచరణ కోసం 8 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ట్రేడ్ యూనియన్ల మద్దతు కోరామని.. ఏఐటీయూసీ మద్దతు ప్రకటించిందని తెలిపారు.

ఐక్య ఉద్యమాలే శరణ్యం... ఉమ్మడి ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోగలమని బొప్పరాజు అన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. జీతాలు ఒకటో తేదీన ఇవ్వడం లేదని, చులకనగా చూస్తున్నారని అన్నారు. జీతభత్యాల్లో భాగమైనవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల్లో తేడాలు చూపిస్తున్నారని.. ప్రశ్నిస్తే చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించక పోవడంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు.

ఉద్యమం ఉద్ధృతం.. సీఎంఎఫ్ఎస్ వ్యవస్థ నుంచి తొలగించాలని, ట్రెజరీ అయితే పారదర్శకంగా, అందుబాటులో ఉంటుందని బొప్పరాజు తెలిపారు. ప్రభుత్వ విధానం వల్ల ఎవరికి అరియర్స్ ఎంతో తెలియదని, ఉద్యమాలు చేస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం.. ప్రభుత్వం స్పందించే వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతూ పని చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.