నెల్లూరు జిల్లా అదనపు కలెక్టర్ సీసీ, డ్రైవర్.. మరికొంత మంది వ్యక్తులు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోన్న ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయంపై ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
'కాళ్లు పట్టించుకున్నారు'
నగరంలోని పొదలకూరు రోడ్డు సర్కిల్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ నవంబర్ 9న అంగన్వాడీ టీచర్‌గా అంబేద్కర్ నగర్లో ఉద్యోగంలో చేరింది. జనవరి 29వ తేదీన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో ఉండాలంటూ సూపర్వైజర్ చెప్పటంతో జనవరి 9 నుంచి అక్కడికి వెళ్ళింది. జేసీ ప్రభాకర్ రెడ్డి సీసీ, డ్రైవర్ మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆమె వాపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య కాళ్లు పట్టించుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. విధులకు హాజరుకావడం లేదంటూ ఇబ్బంది పెట్టేవారని.. చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.
ఇదీ చదవండి: నెల్లూరు బాలిక అత్యాచార ఘటనలో వెలుగులోకి నిజాలు