నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మద్యం షాపు ఎదుట స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. కరోనా ప్రభావం వల్ల పక్క మండలాల్లో మద్యం దుకాణాలు మూసేయగా.... వారంతా తమ ఊరి మద్యం షాపునకు వస్తున్నారంటూ వాపోయారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :