నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది. నాయుడుపేట మీదుగానే... చెన్నై, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ జాతీయ రహదారిపై లారీలు, ఇతర భారీ వాహనాలు వెళ్తుంటాయి. ఫలితంగా... నాయుడుపేట వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై పెద్దపెద్ద గుంతలు పండి వాటిల్లో నీరు నిలుస్తోంది. మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా... ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: