ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్​సీ బిల్లులకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎన్ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలిలో భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు.

all party candle rally against the Citizenship Bill
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Jan 30, 2020, 8:51 AM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీ బిల్లులకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో ర్యాలీ చేస్తూ భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు రోజులపాటు బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటయ్య, మన్సూర్, సమద్, జాషువా పౌరసత్వ సవరణ చట్టం వల్ల తలెత్తే పరిణామాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి తెదేపా, యూటీఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు.

ఇవీ చూడండి...

కావలిలో చామదుంపకి వచ్చింది కష్టం..!

Intro:ఎన్ ఆర్ సి కి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన తో నిరసన

Body:కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉదయగిరిలో కొవ్వొత్తుల ప్రదర్శన తో నిరసన తెలిపారు. బస్టాండ్ కూడలిలో రోడ్డుపై నిలబడి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ లో రద్దు చేయాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, అమీషా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు ఉదృతంగా కొనసాగుతాయన్నారు. ఎన్ఆర్సీ, సి ఎ ఎ, ఎన్ పి ఆర్ లకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు రోజులపాటు బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటయ్య, మన్సూర్, సమద్, జాషువా పౌరసత్వ సవరణ చట్టం వల్ల తలెత్తే పరిణామాలను ప్రస్తావించారు. అఖిలపక్ష ఐక్యవేదిక నిరసన కార్యక్రమానికి తేదేపా, యుటిఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు.

Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ : 8008573944
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.