ప్రతి మండలంలో ఐదుగురు రైతులతో అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్.. సిబ్బందిని ఆదేశించారు. ఉద్యాన, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసి, ఖరీఫ్ లో సాగు విస్తీర్ణం పెంచాలన్నారు.
మత్స్యకారులకు మత్స్యకార రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: