ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు
TOP NEWS
author img

By

Published : Dec 5, 2022, 9:00 PM IST

  • గుజరాత్​ మళ్లీ 'భాజపా'దే.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలివే..
    ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల ప్రకారం గుజరాత్‌లో భాజపా అధికారం నిలబెట్టుకుంటోంది. వరుసగా ఏడోసారి కమలదళం జయభేరి మోగిస్తుందని అన్ని సంస్థల సర్వేల ద్వారా స్పష్టమైంది. కాంగ్రెస్‌ రెండోస్థానానికి పరిమితం కాగా ఆమ్‌ఆద్మీ పార్టీ పెద్దగా ఉనికి చాటుకోలేదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎగ్జిట్​ పోల్స్: హిమాచల్​లో భాజపా- కాంగ్రెస్​ హోరాహోరీ
    భాజపా అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం భిన్నమైన అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తేలగా.. మరికొన్ని మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా' 2021-22 రిపోర్ట్​.. ఏపీనే టాప్​
    దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలలో అత్యధికశాతం రాష్ట్రంలోనే దొరికినట్లు 'స్మగ్లింగ్‌ ఇన్ ఇండియా' 2021-22 నివేదిక తెలిపింది. దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో 18 వేల కిలోల డ్రగ్స్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. వెయ్యి కిలోల గంజాయి, 97 కోట్ల రూపాయల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జయహో బీసీ' సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి లేదు: టీడీపీ
    చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన బీసి నేత రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీసీలను అణగదొక్కుతూ.. జయహో బీసీ అంటూ సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి ఉందా అని నిలదీశారు. బీసీలపై జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రైతులకు ఇచ్చే మద్దతు ధర పైసా కూడా తగ్గొద్దు: సీఎం జగన్​
    రైతులకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలో పైసా కూడా తగ్గకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి చెల్లించాలని,.. ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి తేవడంలో వైసీపీ విఫలం: టీడీపీ ఎంపీలు
    విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి తేవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఎంపీలు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కరోనా వైరస్‌ చైనా నిర్మితమే.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకయ్యింది'
    కరోనా వైరస్‌ విజృంభణకు కారణమైన కొవిడ్‌-19 వైరస్‌ మానవ నిర్మితమైందంటూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆయన పుస్తకంలో పేర్కొన్న విషయాలు సంచలనంగా మారాయి. వుహాన్‌ ల్యాబ్‌లో గతంలో పనిచేసిన ఆయన అందుకు సంబంధించిన వివరాలతో 'ది ట్రూత్ ఎబౌట్ వుహాన్' అనే పుస్తకంలో కీలక విషయాలు తెలిపారు. ఈ పుస్తకం ఆధారంగా అంతర్జాతీయ మీడియాలో కరోనాపై పలు కథనాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాట్సాప్‌లో LIC సేవల కోసం ఎలా రిజిస్టర్‌ అవ్వాలో తెలుసా?
    పాలసీదారులకు మెరుగైన సేవలందించేందుకు ఓ వాట్సాప్‌ నంబర్‌ను LIC అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 10 రకాల సేవలు పొందొచ్చు. ఎలా అంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ICC: అండర్-19 ప్రపంచకప్‌ కెప్టెన్‌గా షెఫాలీ వర్మ.. జట్టును ప్రకటించిన బీసీసీఐ
    రానున్న మహిళల అండర్‌-19 వరల్డ్​ కప్​లో భారత జట్టుకు కెప్టెన్‌గా షెఫాలీ వర్మను ఎంపికైంది. జట్టు సభ్యులు ఖరారయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయ్‌-లోకేశ్‌ కనగరాజ్‌ మూవీ షురూ.. సినిమాలో సూర్య 'రోలెక్స్​' క్యారెక్టర్​​!
    ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్​ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను హిట్​ దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.