UTF Protest : తమ సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారం ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీవోకు అందించారు. జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కోరారు. పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. గిరిజన భాష వాలంటీర్లను రెన్యువల్ చేయాలని ఆయన కోరారు. కొన్ని పాఠశాలలకు నాడు-నేడు ఫేజ్ 1 నిధులు ఇంకా విడుదల చేయలేదని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు.
ఇవీ చదవండి: