Vehicle Burning in AP: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం దగ్ధమైంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎర్రపాడు నుంచి పెదకూటిపల్లికి ద్విచక్రవాహనంపై దంపతులు వస్తున్నారు. మధ్యలో బంధువులు కనిపించడంతో ఆగి.. బైక్ ఆన్‌లోనే ఉంచి మాట్లాడుతున్నారు. ఈలోగా ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగాయి.. మంటలార్పేందుకు స్థానికులు యత్నించినా.. అప్పటికే బైక్ మొత్తం దగ్దమైంది. అప్పటికే వాసుదేవరావు దంపతులు బైక్ పైనుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చదవండి: