ETV Bharat / state

ఏడు ఉద్యోగాల త్యాగాల ఫలితమే ఎస్​ఐ కొలువు - నేటి యువతకు ఆదర్శం

AP Police SI Exam 2023 Results: మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. చాలా మంది తాము అనుకున్న గమ్యాన్ని చేరుకోలేక వచ్చిన దానితో తృప్తి పడుతుంటారు. కొందరు మాత్రం మంకుపట్టుతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి లక్ష్యాన్ని కైవసం చేరుకుంటారు. అలాంటి కోవకే చెందిన ఓ యువకుడు ఎస్ఐ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏడు కొలువులు సాధించిన వాటిని సానుకూలంగా కాదనుకున్నాడు. ఆఖరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాడు.

AP_Police_SI_Exam_2023_Results
AP_Police_SI_Exam_2023_Results
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 2:42 PM IST

AP Police SI Exam 2023 Results : ఎలాగైనా ఎస్​ఐ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ యువకుడు పట్టుదలతో శ్రమించాడు. ఈ క్రమంలో ఏడు ఇతర కొలువులు వరించినా సంతృప్తి చెందలేదు. తన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఎక్కడు కూడా తన ప్రయత్నాలను ఆపలేదు. చివరికి ఎనిమిదో సారి ఎస్ఐ జాబ్ కొట్టి, అనుకున్నది సాధించాడు వెంపడాపు ఈశ్వరరావు. రెండు రోజుల కిందట విడుదల అయిన ఫలితాల్లో మెరిశాడు. గుంటూరు రేంజ్‌ పరిధిలో సివిల్‌ ఎస్ఐ (Civil SI)గా ఎంపికై నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాడు ఈశ్వరరావు.

Vempatapu Eswara Rao Got SI Job After seven Jobs : పార్యతీపురం జిల్లా గరివిడి మండలం ఏనుగువలస గ్రామానికి చెందిన ఈశ్వరరావు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులు వెంపడాపు కృష్ణ, నరసమ్మ కాయకష్టంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. పేదరికం కారణంగా చదువులు ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది. పోలీసుశాఖలో చేరి, ప్రజలకు సేవ చేయాలన్నది అతడి కల. దీంతో బీఎస్సీ పూర్తి చేశాక ఎస్ఐ ఉద్యోగ సాధనకు ప్రయత్నాలు మెదలు పెట్టాడు. ఈ క్రమంలో తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఐదు సంవత్సరాల పాటు లేవలేని స్థితిలో ఉండడంతో కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన బాధ్యత ఈశ్వరరావుపై పడింది.

'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం

SI Success Stories in AP : కొన్నాళ్లకు ఈశ్వరరావు తండ్రి మరణించాడు. కుటుంబ పోషణ కోసం 2014లో ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. కొన్ని సంవత్సరాల పాటు ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీ (Private Pharma Company)లో పని చేశాడు. తల్లి, బావ పైల రామచంద్రరావు అన్ని విధాలా సహకారం అందించారు. అక్కడి నుంచి ఉద్యోగ సాధనకు ప్రయత్నాలు చేశాడు. కాకినాడలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటూ కొన్నాళ్లపాటు ఆ కేంద్రంలోనే శిక్షకుడిగా పని చేశాడు.

ఈశ్వరరావు 2018 నుంచి 2023 వరకు వరుసగా ఎనిమిది ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. 2018లో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ ఉద్యోగం వరించింది. అదే ఏటా గ్రూప్‌-డీ (Group-D)లో రైల్వేలో గ్రౌండ్‌ పాయింట్‌మెన్‌గా ఎంపికయ్యాడు. గుంటూరు డివిజన్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. 2019లో గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు సచివాలయంలో శానిటరీ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. 2022 గ్రూప్‌-డిలో రైల్వే పాయింట్‌మెన్‌ కొలువు సాధించాడు.

Santhosh Giving Free Army Training to Youth: తన కల నెరవేరకపోయినా.. ఆర్మీ ఉద్యోగం సాధించేందుకు యువతకు శిక్షణ

ఎస్సై ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నఈశ్వరరావు వాటిల్లో చేరలేదు. 2022లో ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రైల్వేలో ట్రైన్‌ మేనేజరు ఉద్యోగం సాధించాడు. కుటుంబ సభ్యులంతా ఒత్తిడి తీసుకురావడంతో అందులో చేరాడు. ఆ ఉద్యోగం చేస్తూ మళ్లీ చదవడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2018లో ఒక్క మార్కు తగ్గడంతో కొలువును అందుకోలేక పోయాయని, ప్రస్తుతం తన కల నెరవేరిందని ఈశ్వరరావు తెలిపారు.

Arekapudi Sisters Skill : అరెకపూడి సిస్టర్స్.. 16 ఏళ్లకే.. అమెరికాలో విభిన్న రంగాల్లో సంచలనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.