Prattpati pullarao: మంత్రి విడుదల రజినికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగానే 16వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మూడున్నర వేల కోట్లతో ధరల స్థిరీకరణ పెట్టారు. ఆ డబ్బులు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మంత్రి రజినికి లేదని అన్నారు. నిండు సభలో జగన్ ని రాక్షసుడుతో ఆనాడు విడుదల రజిని పోల్చలేదా అని ప్రశ్నించారు.
అటు పొద్దు ఇటు పొడిచినా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గెలవదని హితవు పలికారు. సమావేశంలో నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: