Sarpanch Met the SP: వైకాపా నాయకులు వివక్షతో వ్యవహరిస్తున్నారని.. కనీసం సర్పంచ్‌ననే గౌరవం కూడా ఇవ్వడం లేదని ఓ దళిత మహిళ సర్పంచ్ వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించింది. తాను సర్పంచ్‌గా గెలుపొంది 18 నెలలు గడుస్తున్నా.. తనకు గ్రామ పంచాయతీలో కనీసం కుర్చీ కూడా లేదని,.. ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని.. పంచాయతీ నిధులను అక్రమంగా విడుదల చేశారని వాపోయింది.
పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తులూరు గ్రామానికి చెందిన బంకా సరోజిని సర్పంచ్‌గా పోటి చేసి గెలుపొందారు. అదే గ్రామానికి వైకాపా నేతలు తనను అసభ్యంగా దూషిస్తున్నారని.. మానసికంగా హింసిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సర్పంచ్‌ననే గౌరవం కూడా ఇవ్వటంలేదని.. తనపై వివక్ష చూపిస్తున్నారని ఆమె వాపోయింది. దళిత సర్పంచ్‌ను కావటంతో.. 18 నెలలు గడుస్తున్నా పంచాయతీ కార్యాలయంలో తనకు కుర్చీ కూడా లేదని తెలిపారు. వైకాపా నాయకులు తనతో ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని అక్రమంగా పంచాయతీ నిధులను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇవీ చదవండి: