ETV Bharat / state

అమ్మవారి తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు.. చిందులేసిన వైకాపా శ్రేణులు - వినుకొండలో అశ్లీల నృత్యాలు

జాతరలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. భక్తితో చేసుకోవాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు చేయించారు. అంతటితో ఆగకుండా.. మహిళల చుట్టూ చేరి చిందులేశారు. వాళ్ల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అండదండలతోనే ఇలాంటి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

అశ్లీల నృత్యాలు
అశ్లీల నృత్యాలు
author img

By

Published : Jun 2, 2022, 5:33 PM IST

Pornographic Dances: కనుమరుగైన అశ్లీల నృత్యాల.. నీచ సంస్కృతిని అధికార పార్టీ వర్గీయులు తిరిగి పరిచయం చేస్తున్నారు. యువతను పెడదోవ పట్టించే అశ్లీల ప్రదర్శనలను అరికట్టేందుకు నాటి ప్రభుత్వాలు, పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో అరికట్టడం జరిగింది. వాటిపై ఆధాపడి జీవిస్తున్నవారికి జీవనోపాధి సైతం కల్పించారు. అశ్లీల ప్రదర్శనలపై నాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి.. కఠిన చర్యలు తీసుకోవటంతో అవి కనుమరుగైపోయాయి.

ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం రాగానే కొన్నిచోట్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నేతలు మళ్లీ ఆ తరహా సంస్కృతిని తిరిగి తీసుకువస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన గంగమ్మ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఈ ప్రభలపై అధికార పార్టీ నేతలు అశ్లీల నృత్యాలు చేయించారు. మహిళల చుట్టూ చేరి.. అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు చిందులేశారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల నృత్యాలు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండదండలతోనే ఈ తరహా కార్యక్రమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: పండగ రోజున అశ్లీల నృత్యాలు.. వైకాపా నాయకుల చిందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.