ETV Bharat / state

కంచే చేను మేసిన.. కలదే దిక్కు! సీఎం పర్యటనల పేరుతో పచ్చని చెట్ల నరికి వేత - సీఎం పల్నాడు పర్యటన

Greenery Cut down: సీఎం భద్రత పేరుతో అధికారులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సీఎం ఎక్కడ బహిరంగ పర్యటన ఉంటే, అక్కడ ఉండే పచ్చని చెట్లను నరికివేయిస్తున్నారు.. భద్రతాసిబ్బంది. కొన్ని రోజుల క్రితం గుంటూరు ప్రధాన రహదారిపై చెట్లను నరికివేసిన అధికారులు, మొన్న విశాఖలోనూ అదే పనిచేశారు. తాజా ఈ నెల 30 న వినుకొండలో సీఎం పర్యటన ఉండటంతో.. ఈ సారి వినుకొండ చెట్లకు వచ్చాయి తిప్పలు.. చెట్లను రక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే..ఇలా విచ్చలవిడిగా నరికివేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.

Greenery Cut down
చెట్లను నరికేస్తున్నారు
author img

By

Published : Jan 29, 2023, 10:31 AM IST

Updated : Jan 29, 2023, 11:40 AM IST

Greenery Cut down: సీఎం పర్యటన పేరుతో రాష్ట్రంలో చెట్ల నరికివేత కొనసాగుతుంది. గతంలో గుంటూరు, విశాఖ నగరంలో చెట్ల నరికివేతపై తీవ్రవిమర్శలు వచ్చినా.. అధికారులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో దాదాపు వంద పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు తెగిపడటంపై సామాన్యులు సైతం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు పర్యావరణ ప్రేమికుల్ని ఒకింత తీవ్ర మనోవ్యధకు గురిచేస్తున్నాయనే వాదన వ్యక్తమవుతోంది.

నరకి వేయకముందు అందంగా ఉన్న చెట్లు
నరకి వేయకముందు అందంగా ఉన్న చెట్లు
రాత్రి సమయంలో చెట్లను నరుకుతున్న కార్మికులు

జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో
జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో
బోసిపోయి కాండంతో ఉన్న చెట్టు
బోసిపోయి కాండంతో ఉన్న చెట్టు

పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. చేదోడు కార్యక్రమంలో లబ్దిదారులకు మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేందుకు ఈనెల 30న సీఎం వినుకొండ వస్తున్నారు. ఈ సందర్భంగా భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోయించారు. సీఎం హెలిపాడ్ ల్యాండింగ్ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు 50 చెట్లు, సభ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో సుమారు 50కి పైగా చెట్లను ఇలా నరికేశారు. భద్రత సిబ్బంది సూచనల మేరకు తొలగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మరియు డీఈఈ వెంకయ్య తెలిపారు.

శారదా పీఠానికి వెళ్లే రహదారి మధ్యలో మొక్కలను ఇటీవల పూర్తిగా కొట్టేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. విశాఖలో పచ్చదనంపై వేటు వేశారు. ప్రముఖుల రాక పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దు అయ్యింది. రహదారిలో ఉన్న దుకాణాలను సైతం మూయించేశారు. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం పర్యటనల పేరుతో పచ్చని చెట్ల నరికి వేత

ఇవీ చదవండి

Last Updated : Jan 29, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.