ETV Bharat / state

Nara Lokesh Fires on CM Jagan and Police in Padayatra: "సీఎం జగన్‌ను, అవినాష్‌ను జైల్లో వేసే దమ్ము పోలీసులకు ఉందా" - క్రోసూరు బహిరంగ సభ

Nara Lokesh Fires on CM Jagan and Police in Padayatra: సీఎం జగన్​, పోలీసులపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై హత్య కేసు పెట్టిన పోలీసులకు.. బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ను, అవినాష్‌ను జైల్లో వేసే దమ్ముందా అని సవాల్​ విసిరారు.

Lokesh_Yuvagalam_Padayatra
Nara_Lokesh_Fires_on_CM_Jagan_in_Padayatra
author img

By

Published : Aug 12, 2023, 10:52 AM IST

Nara Lokesh Fires on CM Jagan and Police in Padayatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై హత్య కేసు పెట్టిన పోలీసులకు.. బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ను, అవినాష్‌ను జైల్లో వేసే దమ్ముందా అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్‌ విసిరారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా క్రోసూరు బహిరంగ సభలో లోకేశ్​ ప్రసంగించారు. గన్‌ కంటే ముందు వస్తా అన్న జగన్.. వైసీపీ నేతలు అనంతపురంలో సెబ్‌ పోలీసుస్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. వైసీపీ నాయకుడు చంద్రశేఖర్, ఆయన అనుచరులు పోలీసుస్టేషన్‌పై దాడి చేసి పోలీసులను చితకబాదితే.. ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

Nara Lokesh Video on Chandrababu Tour: 'బాబు రావాలి.. రాష్ట్రం గెలవాలి'.. చంద్రబాబు ప్రాజెక్టు పర్యటనలపై లోకేశ్​ వీడియో

Lokesh Yuvagalam Padayatra in Palnadu: పల్నాడు జిల్లాలో నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆత్మీయ స్వాగతాలు.. కార్యకర్తల కోలాహలం.. బాణసంచా మెరుపులు.. డప్పుల వాయిద్యాలు.. యువత, మహిళల సందడి మధ్య పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం లోకేశ్‌ పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. క్రోసూరులో సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభకు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో జనసంద్రమైంది. ఆ సభలో పసుపు, యువగళం జెండాలు రెపరెపలాడాయి. పల్లెలు యువగళం దారిపట్టాయి. 181వ రోజు యువనేత లోకేశ్‌ పాదయాత్ర క్రోసూరు శివారు బస కేంద్రం పట్టణంలోని నాలుగురోడ్ల సెంటర్‌ మీదుగా అందుకూరు కూడలి రోడ్డులో ఏర్పాటు చేసిన సభాస్థలి చేరుకుంది.

Nara Lokesh Yuvagalam padayatra: 'సైకో పోవాలి సైకిల్‌ రావాలి'.. గురజాల నియోజకవర్గంలో దుమ్మురేపిన లోకేశ్ పాదయాత్ర..

Lokesh Public Meeting at Krosuru: యువనేత నారా లోకేశ్‌ క్రోసూరులో జరిగిన సభలో తన ప్రసంగం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. జగన్‌కు ఇసుక దోపిడిపై ఉన్న శ్రద్ధ.. నదీ తీర ప్రాంత ప్రజల సమస్యలపై లేదంటూ ప్రసంగించారు. దీంతో నదీ తీర ప్రాంతంలో ఉన్న 14 గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎద్దు వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెదకూరపాడు-అత్తలూరు రోడ్డు 9 నెలలకు గుంతలమయంగా మారడంపై నారా లోకేశ్‌ తన ప్రసంగంలో ప్రశ్నించారు.

Lokesh Fire on MLA Kasu Mahesh in Piduguralla Meeting: కొన్ని నెలలు ఓపిక పట్టండి.. క్యాష్ మహేష్​ను పిల్లి మహేష్​ చేస్తాం: లోకేశ్

EX MLA Kommalapati Sridhar Comments: జగన్‌ మోహన్‌రెడ్డి దుష్టపాలన అంతం చేయబోయేది టీడీపీ అని, రాష్ట్రాన్ని రక్షించేందుకు ఒక రక్షకుడిలా లోకేశుడు వచ్చాడని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. టీడీపీ పాలనలో పెదకూరపాడు నియోజకవర్గం 2వేల 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా గతంలో ఉన్న లోకేశ్‌ సహకారంతో 85 శాతం సిమెంట్‌ రోడ్లు నిర్మించామని శ్రీధర్​ తెలిపారు. యువగళం పాదయాత్రలో మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.