పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉన్మాది కిరాతకంగా యువతి గొంతు కోసి పరారయ్యాడు. నిందితుడిని తులసీరామ్గా గుర్తించారు. పార్క్ ఏరియాలో బాధిత యువతితో తులసీరామ్ సహజీనం చేస్తున్నట్లు తెలిసింది. యువతిపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: 'ఇరు వర్గాల జరిగిన ఘర్షణలే.. యువకుడి హత్యకు కారణం'