Father and son died: ఓ నీటికుంట.. కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిన ఘటన పల్నాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని రామన్నకుంటలో పడి... తండ్రి, కుమారుడు, రెండు ఎడ్లు చనిపోయాయి. పొలం పని ముగించుకొని ఎడ్లబండిపై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతులు గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మధిర నాగరాజు (33), కుమారుడు శరణ్ (9)గా తెలిపారు. ఎడ్ల బండిపై వస్తుండగా ప్రమాదవశాత్తు కుంటలో పడిపోవడంతో.. వీరిద్దరితో పాటు రెండు ఎడ్లు కూడా మృతి చెందాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: