ETV Bharat / state

పాదయాత్రలకు భయపడి జగన్మోహన్​రెడ్డి చీకటి జీవో తెచ్చారు: ప్రత్తిపాటి పుల్లారావు - టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు

Ex Minister Pullarao: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు చీకటి జీవో పై స్పందిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్​ల పాదయాత్రలకు భయపడి జగన్మోహన్​రెడ్డి చీకటి జీవో తెచ్చారని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు యాత్రకు తట్టుకోలేని జగన్​కి.. లోకేష్ పాదయాత్ర అంటే వణుకుపుడుతోందని ఎద్దేవా చేశారు.

Prattipati Pullarao
ప్రత్తిపాటి పుల్లారావు
author img

By

Published : Jan 7, 2023, 6:24 PM IST

Ex Minister Pullarao: చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్​ల పాదయాత్రలకు భయపడి జగన్మోహన్​రెడ్డి చీకటి జీవో తెచ్చారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట తన ఇంట్లో ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు యాత్రకు తట్టుకోలేని జగన్​కి.. లోకేష్ పాదయాత్ర అంటే వణుకుపుడుతోందన్నారు. పాదయాత్రలు ఏ విధంగా ఆపాలని కందుకూరు, గుంటూరులో కుట్ర చేసి చీకటి జీవో తెచ్చాడని విమర్శించారు. నిర్బంధం చేసే కొద్ది ప్రజల స్వేచ్ఛను హరించే కొద్దీ జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని, అణచివేయాలని చూస్తే అంతకంత తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.

ప్రజల్లో వస్తున్న తిరుగుబాటుకు జగన్మోహన్​రెడ్డి తట్టుకోలేడని అన్నారు. పులివెందులలో గెలవలేని పరిస్థితి జగన్మో హన్​రెడ్డికి వస్తుందని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులను చరిత్ర క్షమించదని, ఇలాంటి ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ప్రజలు ఇచ్చే తీర్పు జగన్మోహన్​రెడ్డి ఊహించలేరని.. చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి శ్రేష్టలకు, తుగ్లక్ నిర్ణయాలకు వైసీపీ వారే ఆలోచనలో పడ్డారని వ్యాఖ్యానించారు. వారు కూడా సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు. ఇప్పటికైనా చీకటి జీవోను గౌరవంగా వెనక్కి తీసుకోవాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.