YCP Leaders are Attack : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలో వైసీపీ శ్రేణులు వీరంగం చేశారు. స్థానిక వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ గుర్రం ఉపేంద్ర కుమారులు శివ కోటేశ్వరరావు, కిషోర్, అనిల్ మద్యం మత్తులో.. అర్ధరాత్రి తెలుగుదేశం వర్గీయుల ఇళ్లపై దాడులు చేశారు. ముత్తవరపు పిచ్చి బాబు, ఇక్కుర్తి హుస్సేన్ వలి, మస్తాన్ వలి గృహాలపై రాళ్లు రువ్వారు. వారి ఇళ్ల బయట ఉన్న పూలకుండీలు పగలగొట్టారు. భోగి సందర్భంగా రాత్రి పొద్దు పోయేదాకా ముగ్గులు వేసుకుంటున్న మహిళలు.. భయభ్రాంతులకు గురయ్యారు. పాత కేసుల్లో సాక్షుల్ని రాజీకి రావాలంటూ బెదిరించారని బాధితులు తెలిపారు.
"ముగ్గురు ఇంటి ముందుకు వచ్చి బయటకు రమ్మని కేకలు వేశారు.. చెడు మాటలతో మమ్మల్ని బయటకు రమ్మని పిలిచారు.. రాకపోయే సరికి ఇంటి ముందు తలుపులు కొట్టారు.. తలుపులు తన్నారు. మేము రాకపోయే సరికి బయట ఉన్న కుండీలు పగలగొట్టారు.. తప్పుడు సాక్ష్యాలు ఇస్తావా అని తిట్టారు.. గందరగోళం చేశారు.. మీరు ఎవరికి ఫోన్ చేసినా.. ఎవడొస్తాడని హేళన చేశారు.. అసభ్యంగా మాట్లాడారు.. అర్థరాత్రి సమయంలో వచ్చి అరగంటపైనే గొడవ చేశారు.. మాకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పావు అని బెదిరించారు.. కత్తులు, కర్రలతో వచ్చి మాపై దాడి చేద్దామనుకున్నారు.." పిచ్చి బాబు, బాధితుడు
అర్థరాత్రి సమయంలో వచ్చారు.. మాజీ సర్పంచ్ గుర్రం ఉపేంద్ర కుమారులు వచ్చి గేట్లు తన్ని ..పూల కుండీలు పగలు కొట్టి.. మహిళ అని చూడకుండా అసభ్యంగా తిట్టారు.. భయంతో తలుపులు వేసుకున్నాము.. లేదంటే మమ్నల్ని కొట్టేవాళ్లు.. బయట ఉన్న లైట్లు పగలగొట్టారు.. -లక్ష్మి ,బాధితురాలు
ఇవీ చదవండి: