ETV Bharat / state

మరో పిటిషనర్​కు భద్రత కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం - ఏపీలో మసీదు గొడవలు

Narasa Raopet Jamia Masjid incident: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మసీదు భూముల వ్యవహారంలో పోరాటం చేస్తున్న.. మైనారిటీ నేత ఇబ్రహీం హత్యకు గురి కావడంతో మరో పిటిషనర్‌ ఫరీద్‌కు తక్షణమే రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మసీదు ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మృతుడు ఇబ్రహీం, ఫరీద్‌ సెప్టెంబర్‌ 12న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఫరీద్‌కు  పోలీసు భద్రత
Jamia Masjid incident
author img

By

Published : Dec 22, 2022, 3:38 PM IST

Jamia Masjid incident in Palnadu: మసీదు వ్యవహారంలో వ్యాజ్యం దాఖలు చేసిన ఇద్దరు పిటిషనర్లలో ఒకరైన షేక్‌ ఇబ్రహీం హత్యకు గురికావడంతో.. రెండో పిటిషనర్‌ షేక్‌ ఫరీద్‌కు పోలీసు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు భద్రత కొనసాగించాలని పోలీసులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. సకాలంలో భద్రత కల్పించారా లేదా అన్న విషయం తమ దృష్టికి తీసుకురావాలని పిటిషినర్లకు హైకోర్టు తెలియజేసింది.

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం శ్రీరాంపురంలోని జామియా మసీదు నిర్వహణను ఆధీనంలోకి తీసుకునేందుకు మైనార్టీశాఖ, వక్ఫ్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారని, మసీదు యాజమాన్య హక్కుల విషయంలో అధికారులు, ఇతరుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ నరసరావుపేటకు చెందిన షేక్‌ ఇబ్రహీం, షేక్‌ ఫరీద్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 12న హైకోర్టును ఆశ్రయించారు. మసీదు ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈవ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. వ్యాజ్యం దాఖలు చేసిన మొదటి పిటిషనర్‌ షేక్‌ ఇబ్రహీం ఈనెల 20వ తేదీన హత్యకు గురయ్యారని పిటిషనర్ న్యాయవాది అనూప్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

రెండో పిటిషనర్‌ షేక్‌ ఫరీద్‌కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య ఘటనకు సంబంధించి బుధవారం పత్రిక కథనాలను కోర్టు పరిశీలనకు ఇచ్చారు. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే చంపేస్తామని పిటిషనర్లకు గతంలో బెదిరింపులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హత్య జరిగిందన్నారు. షేక్‌ ఫరీద్‌కు రక్షణ కల్పించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీని ఆదేశించారు.

షేక్‌ ఇబ్రహీం.. మసీదు యాజమాన్య బాధ్యతలు, పునర్నిర్మాణం, దుకాణాల సముదాయాల నిర్మాణాల విషయంలో అక్రమాలను ప్రశ్నిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 12న హైకోర్టును ఆశ్రయించారు. స.హ చట్టంపై అవగాహన కల్పిస్తుంటారు. అక్రమాలపై స.హ దరఖాస్తులను సంధిస్తుంటారు. జీవనోపాధి నిమిత్తం ఓ దుకాణం నిర్వహించేవారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.