Suicide attempt: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి ఎదుట అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యకు యత్నించారు. విప్పర్లపల్లికి చెందిన శ్రావణి, అంజిరెడ్డి అనే ఇద్దరు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. శివనాగేంద్రం అనే అంగన్ వాడీ టీచర్ బలవన్మరణానికి యత్నించారు. పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాను 18 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలివేయాలని.. శ్రావణి, అంజిరెడ్డి అనే ఇద్దరు బెదిరిస్తున్నారని అంగన్వాడీ టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు చెందిన వారికి ఈ ఉద్యోగం కట్టబెట్టాలని మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. తనకు సాయం చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డిని వేడుకున్నారు. అనంతరం నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: APIIC Chairman: నాకు గౌరవ వేతనం అవసరం లేదు.. ఆర్థికశాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్ లేఖ