YuvaSakthi Program in Srikakulam : జనసేన అధినేత ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా ఆ పార్టీ ఆధ్వర్యంలో విడయవాడలో ప్రచారం చేపట్టారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి యువశక్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజులు పాటు విజయవాడలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మొదటి రోజున పశ్చిమ నియోజకవర్గం గొల్లపాలెం గట్టు ప్రాంతంలో యువశక్తి కరపత్రాలను పంచుతూ ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషిస్తారని, దానికి అనుగుణంగానే తమ అధినేత ఈ నెల 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. మూడు రోజులపాటు పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి యువశక్తి ప్రచార కార్యక్రమంతో పాటు స్థానిక ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని, త్వరలో ఈ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును ఇంటికి పంపించడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి