ETV Bharat / state

YSRCP Government Diverted Central Funds: రూ.900కోట్లు కేంద్రం 'కరవు' సాయం.. రైతుల సొమ్ము మాయం చేసిన జగన్‌ ప్రభుత్వం - ap news

YSRCP Government Diverted Central Funds : అందిన చోటల్లా అప్పులు చేసినా చాలక.. ఇంకా, ఇంకా కావాలంటూ రుణ దాహంతో తపిస్తున్న జగన్‌ ప్రభుత్వం.. రైతుల సొమ్ముకూ ఎసరు పెట్టింది. చివరకు కేంద్రం 2019లో ఇచ్చిన 900 కోట్ల కరవు సాయం నిధులనూ నాలుగున్నరేళ్లుగా రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప.. వారిని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

YSRCP Government Diverted Central Funds
YSRCP Government Diverted Central Funds
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 12:44 PM IST

YSRCP Government Diverted Central Funds: రూ.900కోట్లు 'కరవు' నిధులు విడుదల చేసిన కేంద్రం.. రైతుల సొమ్ము మాయం చేసిన జగన్‌ ప్రభుత్వం

YSRCP Government Diverted Central Funds : కేంద్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి కరవు సాయంగా 2019 మే నెలలో 900.40 కోట్లు విడుదల చేసింది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. రైతులకు పెట్టుబడి రాయితీగా 2 వేల కోట్లను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ మేరకు సంతకం చేసొచ్చానంటూ 2019 జులై 8న రైతు దినోత్సవంలో చెప్పారు.

కానీ నాలుగున్నరేళ్లు అవుతున్నా.. రైతులకు జగన్ ఇస్తానన్న 2వేల కోట్ల పెట్టుబడి రాయితీతో పాటు కేంద్రం ఇచ్చిన 900 కోట్ల కరవు సాయమూ రైతులకు అందలేదు. అంత పెద్ద మొత్తం ఏమయిందో.. ఎటు మళ్లించారో తెలియని పరిస్థితి. ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతులకు 1.70 లక్షల కోట్ల సాయం చేశామంటూ పదేపదే చెప్పే ముఖ్యమంత్రి జగన్.. కేంద్రం నుంచి వచ్చిన సొమ్మును ఏం చేశారో కూడా చెబితే బాగుంటుందని విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు

Drought Zones Funds Diverted by Jagan Government : రాష్ట్రంలో 2018-19 ఖరీఫ్ కరవు కారణంగా రైతులు పెట్టుబడుల్ని నష్టపోయారు. అప్పటి ప్రభుత్వం 9 జిల్లాల్లో 347 కరవు మండలాలను ప్రకటించడంతో పాటు పెట్టుబడి రాయితీగా 1,869.19 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర బృందం సైతం కరవు తీవ్రతను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో కేంద్రం 2019 మే నెలలో 900.40 కోట్లు విడుదల చేసింది. కరవు సాయానికి సంబంధించి కేంద్రం ఇచ్చే నివేదికలతో పాటు రాజ్యసభ, లోక్‌సభ ఇచ్చే సమాధానాల్లోనూ రాష్ట్రానికి 2018-19 సంవత్సరంలో 900.40 కోట్లు ఇచ్చామని పేర్కొంటోంది. ఆ మొత్తం ఇప్పటివరకు చేరకపోవడమే విచిత్రంగా ఉంది.

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 2018-19 సంవత్సరానికి పెట్టుబడి రాయితీ చెల్లిస్తామంటూ సీఎం జగన్, అప్పటి వ్యవసాయ మంత్రి కన్నబాబు పలుసార్లు ప్రకటించారు. రైతు దినోత్సవం సభతో పాటు అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. 2019 నవంబరులోపే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని గొప్పగా చెప్పారు. తర్వాత ఆ విషయాన్నే పక్కన పెట్టేశారు. వాస్తవానికి 2018-19 ఖరీఫ్ కరవుకు సంబంధించి రైతులకు మొత్తం 1,869.19 కోట్లు పెట్టుబడి రాయితీ ఇవ్వాలి. అందులో కేంద్రం 900 కోట్లు ఇచ్చింది.

Central Government Inquiry into Diversion of Finance Commission Funds: నిధుల మళ్లింపుపై కేంద్రం ప్రభుత్వం విచారణ.. ఈ నెల26, 27 తేదీల్లో పర్యటన

ఈ మొత్తానికి మరో 969 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపితే 9 కరవు ప్రభావిత జిల్లాల రైతులకు ప్రయోజనకరంగా ఉండేది. కానీ రాష్ట్ర వాటా అటుంచి.. కేంద్రం విడుదల చేసిన సొమ్మునూ పంపిణీ చేయకపోవడం రైతుల సంక్షేమంపై జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. అసలు కేంద్రం ఇచ్చిన సొమ్మును రైతులకు ఇవ్వకుండా ఎటు మళ్లించారు. ఏ అవసరాలకు ఖర్చు చేశారనే విషయాన్నీ వైసీపీ సర్కారు వెల్లడించకపోవడం ఇప్పుడు అనుమానులను రేకెత్తిస్తోంది.

మేం దేనికిచ్చాం..! మీరు దేనికి వాడారు..! నిధుల మళ్లింపుపై రుణసంస్థల నోటీసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.