YSRCP failed to solve problems : చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే బంపర్ ఆపర్లు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరికి సీటిస్తామనే హామీ ఇస్తే..., నలుగురు ఎమ్మెల్యేలం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. మేం టీడీపీలోకి వెళ్లం.. వైసీపీతోనే మా జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే బంపర్ ఆఫర్ ప్రకటించిన జాబితాలో ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. వైసీపీ లో తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందన్నారు. తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల జాబితా చెప్పాలని మంత్రులు డిమాండ్ చేయడం పిచ్చితనమని విమర్శించారు. వైసీపీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రజా వ్యతిరేకతతో ధర్మాన, బొత్స.. ఉద్దేశపూర్వకంగా నే బ్యాలెన్స్ తప్పుతున్నారని మండిపడ్డారు. ఓ కానిస్టేబుల్ ట్రాన్సఫర్ కూడా చేయించు కోలేకపోతున్నాననే బాధ ధర్మాన, బొత్సకు ఉందని ఆక్షేపించారు. ఇద్దరూ ఎప్పుడు మంత్రి అయినా వారికి స్వయం ప్రతిపత్తి ఉండేది, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. ధర్మాన మహిళల ముందు మీసాలు మేలేస్తున్నారు, తొడ కొడుతున్నారు. మగాళ్లను పొరంబోకులు అంటూ ధర్మాన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసింది: ఒంటిమిట్ట వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి కుంటి సాకులు చెప్పారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి సీఎం కాలు బెణికిందనేది కుంటి సాకేనని తెలిపారు. సతీ సమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదన్నారు. సీఎం జగన్ తీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చు.. కానీ, సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లలి కదా అని ప్రశ్నించారు. జగ్జీనన్ రాం జయంతి, చిలకలూరి పేట కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్ చక్కగా నడుచుకుంటూ వెళ్లినప్పుడు లేని కాలునొప్పి ఒంటిమిట్ట కళ్యాణం అంటేనే వచ్చిందా అని నిలదీశారు.
వివేకా హత్యకేసు: జగనే మా దరిద్రం అని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తుంటే సజ్జలకు, ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. సొంత తల్లి, చెల్లి, బావ, బాబాయ్ కూతురే జగన్ ని నమ్మకపోతే ప్రజలు ఎలానమ్ముతారని నిలదీశారు. అధికారంలో ఉండి కూడా వివేకా హత్యకేసు ముద్దాయిల్ని శిక్షించలేనందుకు జగన్ ను నమ్మాలా అని ధ్వజమెత్తారు.
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్: వైద్యరంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి, క్షేత్రస్థాయిలో వాటిని వినియోగించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ చెబుతున్న ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పెద్ద కామెడీ ప్రోగ్రామ్ అని ఎద్దేవా చేశారు. కేవలం 2,875 మంది వైద్యులతో రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యసేవలు ఎలా అందిస్తాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేసారు. వైద్యరంగం బలోపేతానికి, వైద్యారోగ్యశాఖలో నియామకాలకు సంబంధించి తన ప్రభుత్వం తీసుకున్నచర్యలపై పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: