ETV Bharat / state

'తెలుగుభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది'

World Telugu Writers Mahasabhalu: ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు రెండో రోజు ఘనంగా జరిగాయి. మహిళా రచయితల సదస్సు ఉత్సాహ భరితంగా సాగింది. తెలుగు భాష గొప్పతనం... భాషా పరిరక్షణ కోసం తెలుగు వారు చేయాల్సిన కృషిని గురించి పలువురు రచయిత్రిలు వారి భావాలు పంచుకున్నారు. ప్రతి మహిళ తన పిల్లలకు చిన్న వయస్సు నుంచే తెలుగు భాష పట్ల గౌరవం పెంపొందించాలన్నారు.

తెలుగు రచయితల ఐదో మహాసభ
Prapancha telugu mahasabhalu
author img

By

Published : Dec 24, 2022, 9:22 PM IST

రెండోరోజూ ఉత్సాహంగా ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు

World Telugu Writers Mahasabhalu in AP: సమాజంలోని వ్యసనాలు, రుగ్మతలకు వ్యతిరేకంగా, సామాజిక పరిస్థితులను మార్చే శక్తి కవులకు, రచయితలకు మాత్రమే ఉందని తెలుగు భాషాభిమానులు చాటిచెప్పారు. తరతరాలుగా మాతృభాషలో వచ్చిన అనేక రచనలు సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని సంఘటిత శక్తిగా కదిలేందుకు ప్రేరణగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ సరైన సమయంలో సరైన ఔషధమనే భావనను వ్యక్తం చేశారు.

విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు రెండోరోజూ ఉత్సాహంగా సాగాయి. మూడు వేదికలపై విభిన్న అంశాలు చర్చించారు. మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్రపై జరిగిన సదస్సులో సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ, ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్​ ఏబీ వెంకటేశ్వరరావుతో సహా పలువురు పాల్గొన్నారు. బుల్లెట్లు చేయలేని పనిని- రచనలు చేసి చూపించగలవని లక్ష్మీనారాయణ అన్నారు. మత్తు పదార్ధాల బానిసత్వం నుంచి యువతను జాగృతులను చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రతిఘటించడానికి రచయితలు ఎవరూ వెనకడుగు వేయబోరని వక్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.

'నేటి యువత తెలుగు భాషలో చదవలేని, రాయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఆంగ్ల భాషతో పాటు తెలుగు భాషను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో తెలుగు మాద్యమం రద్దు చేయడం దారుణం. ఐదో తరగతి వరకు కచ్చితంగా అన్ని విద్యాసంస్థల్లో తెలుగు మాద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. చిన్నప్పటినుంచి భాష, వివాహజీవితంలో ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రలతో పాటు ఉపాధ్యాయులపై ఉంటుంది.' - పలువురు వక్తలు

తెలుగు మహాసభల్లో రెండో రోజూ.. భాషోద్యమ, చరిత్ర, సాంస్కృతిక , వైజ్ఞానిక రంగ ప్రతినిధులు సభల్లో పాల్గొన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, తెలుగు కవిత, సాహిత్య ప్రక్రియల్లో సామాజిక మార్పులపై చర్చించారు. కవి సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. పుస్తకావిష్కరణలతో పాటు... అమెరికా, దుబాయి, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో విదేశాల్లో తెలుగు భాషపై ప్రత్యేకంగా ఓ సదస్సు నిర్వహించారు. పోలండ్‌కు చెందిన బుజ్జీ తనదైన రీతిలో తెలుగు పాటలు పాడి అలరించాడు.

ప్రపంచంలో ఎక్కడున్నా పుట్టిన నేలను, మతృభాషను మరచిపోకూడదని రచయితలు అభిప్రాయ పడ్డారు. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందన్నారు. విద్యార్థులకు చిన్న వయస్సు నుంచి భాష మీద గౌరవం.. నేర్చుకోవాలన్న తపన ఉపాధ్యాయులు పెంపొందించాలని కోరారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.