Attack: అశ్లీల వీడియో తీసి వైరల్ చేసిన పెనుగంచిప్రోలులోని కంఠమనేని ఫంక్షన్ హాలు యజమాని వేణుగోపాల్‌పై బాధిత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ హరిప్రసాద్ వివరాల మేరకు.. వివాహితతో సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా అమర్చిన సెల్‌ఫోన్‌లో వేణుగోపాల్ వీడియో తీశాడు. దానిని బయటపెడతానని చాలాకాలం బెదిరించాడు. ఆమెను అనేక సార్లు లైంగికంగా వేధించాడు. ఇటీవల ఆ వీడియోను ఇతరులకు పంపి ఆమె పరువుకు విఘాతం కలిగించాడు. ఆ విషయమై అతన్ని ప్రశ్నించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆమె ఫంక్షన్ హాలుకు వెళ్లగా... వారిపై వేణుగోపాల్ దురుసుగా ప్రవర్తించాడు. ఆగ్రహం చెందిన వారు అతనిపై దాడి చేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి అతన్ని స్టేషన్‌కు తీసుకువచ్చారు. గాయపడ్డ వేణుగోపాల్‌ని 108 వాహనంలో చికిత్స కోసం నందిగామ ఆసుపత్రికి పంపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇవీ చదవండి: