Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇది 48 గంటల్లో తమిళనాడు - దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదులుతుందని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: